రామ్‌ సరసన ఈ ఇద్దరు..

కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో రామ్‌ కథానాయకుడుగా ఓ సినిమా తెరకెక్కుతుంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రమిది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో కథానాయికలుగా నివేదా పేతురాజ్, మాళవిక శర్మ నటిస్తున్నారని సమాచారం. నవంబరు నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభంకానుంది. తమిళంలో విజయం అందుకున్న ‘తడం’ చిత్రానికి తెలుగు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై నిర్మితమవుతోంది. కిషోర్, రామ్‌ కలయికలో వచ్చిన ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రాల తర్వాత హ్యాట్రిక్‌గా రాబోతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. చిత్ర టైటిల్‌ త్వరలోనే ప్రకటించనున్నారు. Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.