రామ్‌తో రాజమౌళి?

రామ్‌తో ఎస్‌.ఎస్‌. రాజమౌళి సినిమా తెరకెక్కిస్తున్నారా? అవకాశాలున్నాయంటున్నాయి సినీ వర్గాలు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పూర్తయ్యాక తక్కువ బడ్జెట్‌లో ఓ చిత్రం తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఆ వినూత్న కథలో హీరోగా రామ్‌ని ఎంపిక చేసే ఆలోచనలో జక్కన్న ఉన్నట్లు తెలుస్తోంది. రాజమౌళి గతంలో రామ్‌ చరణ్ కథానాయకుడుగా ‘మగధీర’ తెరకెక్కించిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో రూపొందించి తెలుగు సినిమా సత్తా చాటాడు. దాంతో తదుపరి సినిమా సైతం అదే స్థాయిలో తెరకెక్కిస్తాడనుకున్నారు సినీ ప్రియులంతా. కానీ, సునీల్‌తో ‘మర్యాద రామన్న’ అనే విభిన్న కథను తక్కువ బడ్జెట్‌లో రూపొందించి ఆశ్చర్యపరిచాడు. జక్కన్న అదే పంథాను మరోసారి కొనసాగించే ఉద్దేశంలో ఉన్నారని వినికిడి. రామ్‌ చరణ్, ఎన్టీఆర్‌ కథానాయకులుగా వస్తోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. భారీ హంగులతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతుంది. దీని తర్వాత రామ్‌ కోసం ఓ కథ సిద్ధం చేశాడని వినిపిస్తోంది. నిజమెంతో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో ‘రెడ్‌’ చిత్రంతో బిజీగా ఉన్నాడు రామ్‌.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.