రామ్‌చరణ్‌ తండ్రిగా నటిస్తున్నదెవరు?

భారీ వ్యయంతో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ జరుపుకుంటోంది. బాలీవుడ్‌కి చెందిన అజయ్‌ దేవగణ్‌ ఇందులో ఓ కీలక పాత్ర పోషించనున్నారు. ఇందులో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. సీతారామరాజు తండ్రిగా అజయ్‌ దేవగణ్‌ నటిస్తున్నారని సమాచారం. ఎన్టీఆర్‌ కొమరం భీంగా నటిస్తుండగా, అలియాభట్‌ రామ్‌చరణ్‌ సరసన నటిస్తోంది. చిత్రంలో జగపతిబాబు, సుదీప్, సముద్రఖనిలు నటిస్తున్నారు. డీవీవీ పతాంకపై నిర్మితమౌతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.