యువదర్శకుడితో రామ్‌చరణ్‌ చిత్రం?


మెగాస్టార్‌ తనయుడు రామ్‌ చరణ్‌ ఓ పక్క హీరోగా, మరోపక్క నిర్మాతగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో కలిసి ‘రౌద్రం రణం రుథిరం’ (ఆర్‌.ఆర్‌.ఆర్‌ ) చేస్తున్నాడు. అయితే ఈ సినిమా పూర్తవ్వగానే మరో సినిమాను సెట్స్ పైకి ఎక్కించేందుకు కసరత్తులు చేస్తున్నాడట. యువదర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడనే వార్తలు వస్తున్నాయి. సినిమా దాదాపు ఖరారైందనే వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌లు ఆగిపోయిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ పూర్తికాగానే సినిమా షూటింగ్‌లు ప్రారంభమౌతాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఇప్పటికే చాలాభాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. మరోపక్క గౌతమ్‌ తిన్ననూరి బాలీవుడ్‌లో షాహిద్‌ కపూర్‌తో కలిసి ‘జెర్సీ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాలు పూర్తవ్వగానే రామ్‌ - గౌతమ్‌ల చిత్రంపై పూర్తి వివరాలు రానున్నాయని చెప్పుకుంటున్నారు. రామ్ చరణ్‌ తన తండ్రి చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రంలోనూ ఓ కీలక పాత్ర చేయనున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.