బాబాయి చిత్రంలో అబ్బాయి?

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ కొత్త చిత్రం చేస్తున్నాడంటే చాలు. ఆయన అభిమానుల్లో చెప్పలేని ఆనందం. ప్రస్తుతం ఆయన క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో రామ్‌చరణ్‌ కూడా అతిథి పాత్రలో కనిపించనున్నాడని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పాన్‌ ఇండియా స్థాయిలో ఓ పీరియాడికల్‌ చిత్రంగా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో వేసిన ప్రత్కేక సెట్లో చిత్రీకరణ జరపుకుంది. ఈ చిత్రం మొగలాయిల కాలం నాటి ఓ ఆసక్తికర కథాంశంతో రూపొందబోతుందని, ఇందులో పవన్‌ రాబిన్‌హుడ్‌ తరహాలో పవర్‌ఫుల్‌ దొంగలా దర్శనమివ్వబోతున్నారని ఇప్పటికే వార్తలు బయటకొచ్చాయి. లాక్‌డౌన్‌ కారణంగా చిత్రీకరణ మధ్యలోనే ఆగిపోయింది. రామ్‌చరణ్‌ ఇప్పటికే తన తండ్రి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ చిత్రంలోనూ కీలక పాత్రలో నటిస్తున్నారు. మొత్తం మీద ఇటు తండ్రి చిత్రానికి నిర్మాతగా వ్యవరిస్తూనే, మరోవైపు బాబాయి చిత్రంలో అతిథి పాత్రలో చేయనున్నాడనే వార్త మెగా అభిమానులకు శుభవార్తే.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.