బాబాయ్‌ స్ఫూర్తితో అబ్బాయి విరాళం

మెగాస్టార్‌ తనయుడు రామ్‌ చరణ్‌ కరోనా నేపథ్యంలో తన చిన్నాన్న పవన్‌ కల్యాణ్‌ రెండుకోట్ల విరాళం ప్రకటించాడు. ఇప్పుడు అదే దారిలో రామ్‌ చరణ్‌ కూడా తనవంతుగా డెభ్బై లక్షల రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఇదే అంశాన్ని రామ్‌చరణ్‌ ట్విట్టర్లో పోస్ట్‌ చేస్తూ..‘‘పవన్‌ కల్యాణ్‌ స్ఫూర్తితోనే కేంద్రానికి, ఇటు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు కలిపి రిలీఫ్‌ పండ్‌ కింద 70 లక్షలు ప్రకటిస్తున్నా. అంతేకాదు కరోనా వైరస్‌ని నిరోధించడానికి దేశ ప్రధాని మోదీతో పాటు మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకుంటున్న చర్యలు అభినందనీయం. ప్రతి పౌరుడు తన బాధ్యతలను గుర్తెరిగి ఒక బాధ్యతగల పౌరుడిగా ఉండాలని కోరుకుంటున్నా’’ అంటూ పేర్కొన్నాడు. నిన్న రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ నటిస్తున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ టైటిల్‌ లోగోను ఆవిష్కరించారు. మోషన్‌ పోస్టర్‌ను చూస్తూంటే చిత్రంపై అంచాలను పెంచేస్తుంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.