త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌?

తెలుగు దర్శకుల్లో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ది ప్రత్యేకమైన శైలి. ఆయన చిత్రాల్లో పంచ్‌లు ఎక్కువగా ఉంటాయి. అయినా సరే అవి అర్థవంతంగా ఉంటాయని సినీ ప్రేక్షకులు చెప్పుకుంటుంటారు. ఈ ఏడాది అల్లు అర్జున్‌ హీరోగా ‘అల వైకుంఠపురములో’ చిత్రాన్ని తెరకెక్కించి ఘనమైన విజయాన్ని అందుకున్నారు. దాంతో త్రివిక్రమ్‌ చేతిలో కొత్త సినిమాలు వచ్చి చేరాయి. తాజాగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ నటుడు రామ్‌చరణ్‌కి ఓ కథ వినిపించాడట. కథ విన్న రామ్‌చరణ్‌ సానుకూలంగానే స్పందించాడనే వార్తలు బయటకు వస్తున్నాయి. అన్ని సక్రమంగా జరిగితే ‘ఆర్.‌ఆర్.‌ఆర్’‌ చిత్రం తరువాత వీరి సినిమా తెరపైకి రానుంది చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం రామ్‌చరణ్‌ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్.‌ఆర్.‌ఆర్’‌. ఇందులో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా, ఎన్టీఆర్‌ కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం కరోనా వైరస్‌ వల్ల షూటింగ్‌ వాయిదా పడింది. ఇక రామ్‌చరణ్‌ తన తండ్రి చిరంజీవి నటిస్తున్న‘ఆచార్య’ చిత్రాన్ని నిర్మించడంతో పాటు ప్రత్యేక అతిధి పాత్రలో నటించనున్నాడని వార్తలు కూడా వస్తున్నాయి. మరోపక్క త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఎన్టీఆర్‌తో సినిమా తెరకెక్కించనున్నాడు. 



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.