అనగనగా ఒకరోజు ఏం జరిగిందంటే...

రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో జేడీ చక్రవర్తి ఊర్మిళ మంటోడ్కర్‌ కలిసి నటించిన చిత్రం ‘అనగనగా ఒకరోజు’. ఇందులో రఘువరన్‌తో పాటు బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, రామిరెడ్డి లాంటి ఇంకెందరో నటించి మెప్పించారు. 1996లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసుకొంది. ఈ సినిమాలో నటనకు గాను బ్రహ్మనందానికి ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డు కూడా లభించింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫోటోను రామ్‌గోపాల్‌ వర్మ తన ట్విట్టర్లో పెట్టాడు. ‘‘ఈ ఫోటో అనగనగా ఒకరోజు చిత్రం షూటింగ్‌ పూర్తైయినప్పుడు నటీనటులు సాంకేతికనిపుణలందరూ గ్రూపుగా ఉన్నా దిగిన ఫోటో అంటూ..’’గుర్తు చేసుకున్నారు. రామ్‌గోపాల్‌ వర్మ కూడా అలా ఓ ఇరవైనాలుగు సంవత్సరాల కిందటి పాత సంగతులను ఇలా గుర్తు చేసుకొంటున్నాడన్న మాట. ప్రస్తుతం రామ్‌గోపాల్ వర్మ తెలుగులో రాష్ట్రంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ‘మర్డర్’‌ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.