చూసీ చూడంగానే నచ్చాశావే!

‘చూసీ చూడంగానే నచ్చాశావే.. అడిగి అడగకుండా వచ్చేశావే నా మనసులోకి అందంగ దూకి’ అని రష్మికను చూసిన ప్రతి ఒక్కరు అనాల్సిందే. తొలి చిత్రం ‘ఛలో’తోనే నటిగా మంచి గుర్తింపు పొందింది. కార్తిక పాత్రతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది రష్మిక. ఆ తర్వాత గీతగా ‘గీత గోవిందం’ సినిమాతో మరో మెట్టు ఎక్కింది. విజయ్‌ దేవరకొండతో చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఈ చిత్రం ఘన విజయం అందుకోవడంతో నాగార్జున, నాని కథానాయకులుగా తెరకెక్కిన ‘దేవదాసు’లో అవకాశం దక్కించుకుంది. ఇందులో నాని సరసన కనిపించి మెప్పించింది. మరోసారి విజయ్‌ దేవరకొండతో ‘డియర్‌ కామ్రేడ్‌’లో నటించింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా ‘లిల్లి’ పాత్రకు మంచి మార్కులు వేశారు ప్రేక్షకులు. మీకు అర్థమవుతోందా అంటూ ప్రతి ఒక్కరి నోటి నుంచి వచ్చేలా చేసింది ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో. సంస్కృతిగా మహేష్‌ బాబు పక్కన కనిపించి అందర్ని ఫిదా చేసిందీ భామ. ‘భీష్మ’కు జంటగా చిత్ర పాత్రలో సందడి చేసింది. ప్రస్తుతం అల్లు అర్జున్‌ కథానాయకుడుగా సుకుమార్‌ తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తోంది. నేడు రష్మిక పుట్టిన రోజు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.