మరో తెలుగు చిత్రంలో రష్మిక..!

కన్నడ అందాల సుందరి రష్మిక మందన్న ఈ ఏడాది మహేష్‌బాబు సరసన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో మీకు అర్ధమౌతుందా అంటూ తనదైన శైలిలో మ్యానరిజం పలికించిన రష్మిక ప్రస్తుతం కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో కథానాయికగా అవకాశం దక్కించుకుందని వార్తలొస్తున్నాయి. శర్వానంద్‌ కథానాయకుడిగా నటిస్తున్న సినిమాకి ఆడాళ్లు మీకు జోహార్లు అనే పేరును పరిశీలించనున్నారట. చిత్ర షూటింగ్‌ని అక్టోబర్‌ 25న దసరా పండగను పురస్కరించుకొని తిరుపతి పట్టణంలో ప్రారంభించనున్నారట. మొత్తం మీద రష్మిక తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకోవడం గమనార్హాం. మరోవైపు ఇప్పటికే అల్లు అర్జున్‌తో కలిసి పుష్ప చిత్రంలో సందడి చేస్తుంది. తమిళంలో కార్తీ హీరోగా వస్తున్న సూల్తాన్‌ చిత్రంతో తమిళంలోనూ అడుగుపెట్టింది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.