పాటతో రాబోతున్న ‘డిస్కోరాజా’
రవితేజ సరదాగా ఓ పాటేసుకున్నారు. తర్వాత తన స్టైల్లో ఓ ఫైట్‌ షూరూ చేశారు. ఇప్పుడేమో దోస్తులతో కలిసి నవ్వులు పంచుతున్నారు. వీటన్నింటికీ వేదిక రామోజీ ఫిలింసిటీనే. రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘డిస్కోరాజా’. వి.ఐ.ఆనంద్‌ దర్శకుడు. రామ్‌ తాళ్లూరి నిర్మాత. పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేష్‌ నాయికలు. ఈ సినిమా చిత్రీకరణ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. ప్రస్తుతం రవితేజ, సునీల్‌, రాంకీ, సత్య తదితరులపై హాస్య సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ ప్రత్యేకంగా వేసిన పబ్‌ సెట్లో ‘నువ్వు నాతో ఏమన్నావో’ అంటూ సాగే పాటను చిత్రీకరించారు. శనివారం ఈ గీతాన్ని విడుదల చేయనున్నారు. తమన్‌ సంగీతం అందించారు. సీతారామశాస్త్రి రచించిన ఈ గీతాన్ని ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. సినిమాలో కీలకమైన ఓ పోరాట సన్నివేశాన్నీ తెరకెక్కించారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.