నాయిక దొరికిందా?

అగ్ర నాయకులకు జోడీ వెతకడానికి కాస్త సమయం పడుతుంది. ఓ సారి నటించవారినే తీసుకోవాలా, కొత్త నాయికల్ని ఎంపిక చేయాలా? అనే సందిగ్ధం ఉంటుంది. రవితేజ విషయంలో ఇదే జరుగుతుంది. ఆయన పక్కన ఎవరైతే బావుంటారు? ఆయన హుషారు తగ్గట్లు ఎవరు అభినయిస్తారు? అనే దర్శకుడు రమేష్‌ వర్మ ప్రశ్నలకు సమాధానం దొరికనట్లే అంటున్నాయి సినీ వర్గాలు. రవితేజతో రమేష్‌ వర్మ ఓ చిత్రం తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రవితేజకు జోడీగా ఇద్దరు భామలకు అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే చాలామంది నాయికల పేరు పరిశీలనలో ఉన్నాయి. ప్రధాన నాయికగా రీతూవర్మని ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే చర్చలు సాగాయని, పాత్ర ఆసక్తికరంగా ఉండటంతో రీతూ పచ్చజండా ఊపినట్లే అని సినీ వర్గాల టాక్‌. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. మరో నాయికగా సీరత్‌కపూర్‌ పేరు ప్రచారంలో ఉంది. ఈ చిత్రానికి ‘కిలాడీ’ అనే పేరు పరిశీలనలో ఉంది. కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.