ప్రత్యేక గీతంలో కేథరిన్‌!

మాస్‌ మహరాజ్‌ రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘క్రాక్’‌. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో కథానాయికగా శ్రుతిహాసన్‌ నటిస్తోంది. అయితే ఈ సినిమా తరువాత రమేష్‌ వర్మ దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయనున్నారు.  చిత్రంలోని ఓ ప్రత్యేక గీతంలో ‘ఇద్దరమ్మాయిలతో’ కథానాయిక కేథరిన్‌ నటిస్తోందని సమాచారం. రవితేజ ద్విపాత్రాభినయం చేయనున్న ఇందులో నిధి అగర్వాల్‌, నభా నటేష్‌ కథానాయికలుగా నటించనున్నారు. కేథరిన్ ఈ ఏడాదిలో విజయ్‌ దేవరకొండతో కలిసి ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్’‌ చిత్రంలో నలుగురి కథానాయికల్లో ఒకరిగా నటించి అలరించించింది. కేథరిన్‌ ప్రత్యేక గీతంలో నటించడం కొత్తేమీ కాదు. బెల్లంకొండ హీరోగా వచ్చిన ‘జయ జానకి నాయక’ చిత్రంలోని ‘‘ఏ ఫర్‌ ఆఫిల్‌’’ అంటూ సాగే గీతంలో ఆడిపాడింది. అంతకు ముందు రానా దగ్గుబాటి చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’లో రెండో నాయికగా నటించి అలరించింది. 



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.