బాలీవుడ్‌ నటి రేఖ బంగ్లాకు కోవిడ్‌-19 హెచ్చరిక బోర్డు


మహరాష్ర్ట రాజధాని ముంబై నగరంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికిని కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా బాలీవుడ్‌ నటి రేఖ ఇంట్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రావడంతో ముంబైలోని బీకేసీలో వైద్య సదుపాయానికి తరలించారు. బాంద్రాలోని రేఖ ఇంటిని బీఎమ్‌సీ అధికారులు కంటెయిన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. ఆ ప్రాంతం మొత్తాన్ని శానిటైజ్‌ చేశారట మున్సిపల్‌ సిబ్బంది. రేఖ ఇంటికి కోవిడ్‌-19 హెచ్చరిక బోర్డును సైతం అధికారులు ఏర్పాటు చేశారు. అయితే ఈ సంఘటనకు సంబంధి రేఖ లేదా ప్రతినిధి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఆ మధ్య బోనీకపూర్‌ ఇంట్లో పనిచేసే సహాయకులకు కరోనా పాజిటివ్‌ రావడంతో వారందరిని క్యారంటైన్‌కి తరలించారు. చికిత్స తరువాత వారుకోలుకొని ఇంటికొచ్చిన సంగతి తెలిసిందే. తరువాత అమీర్‌ఖాన్‌ దగ్గర పనిచేసే సహాయక సిబ్బందికి సైతం పాజిటివ్‌ వచ్చింది. కరణ్ జోహార్ సిబ్బంది కూడా 19 కు పాజిటివ్ పరీక్షించారు మరియు వారిని నిర్బంధ కేంద్రాలకు తరలించారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ నుంచి కాపాడుకోవడానికి ప్రజలంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రరాష్ర్ట ప్రభుత్వాలు కోరుతున్నాయి. రేఖ తెలుగులో ఇంటిగుట్టు, రంగులరాట్నం చిత్రంలో బాలనటిగా నటించింది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.