ఆ ముద్దు నాకు నిద్ర లేకుండా చేసింది!

తెలుగులో రాజేంద్ర ప్రసాద్‌తో కలిసి ‘తేనెటీగ’ చిత్రంలో నటించి మెప్పించిన అందాల తార రేఖ. ఆమె అసలు పేరు జోసెఫ్‌పిన్‌. ఆమె గతంలో ‘పున్నగాయ్‌ మన్నన్‌’ అనే తమిళ సినిమాలో కమల్‌తో కలిసి నటించిన ఓ ముద్దు సన్నివేశం గురించి చెప్పిన విషయాలు తాజాగా సామాజిక మాధ్యమాల్లో సంచలనాత్మకమయ్యాయి. ‘‘ఆ సినిమాలో ఓ ముద్దు సన్నివేశం ఉంది. దీని గురించి ముందుగా నాకు చెప్పలేదు. షూటింగ్‌లో కమల్‌ ఒక్కసారిగా ముద్దు పెట్టేశాడు. దాంతో నాకు ఏం జరిగిందో అర్థం కాలేదు. వెంటనే బాలచందర్‌ని అడిగితే ‘ఇందులో ఎలాంటి తప్పులేదు. సినిమాలో సన్నివేశానికి అనుగుణంగానే ఉందని’ చెప్పాడు. ఆ తరువాత కొంతకాలం పాటు ఆ సన్నివేశం నాకు నిద్రలేకుండా చేసిందని’’ చెప్పింది. ఒక్కోసారి పాత జ్ఞాపకాలు కూడా కొత్త వార్తలు పుట్టించేలా ఉంటాయి.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.