ఆర్జీవీ నూతన చిత్రం ‘థ్రిల్లర్‌’


లాక్‌డౌన్‌ సమయంలోనూ వరుస పెట్టి సినిమాలు తెరకెక్కిస్తూ జోరు ప్రదర్శిస్తున్నారు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. ఇటీవలే ఆయన ‘మర్డర్‌’, ‘12 ఓ క్లాక్‌’ సినిమాలు పట్టాలెక్కిస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఒడిశాకు చెందిన అప్సర రాణి కథానాయికగా ‘థ్రిల్లర్‌’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సోమవారం ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ సినిమాను ఆర్జీవీ వరల్డ్‌ థియేటర్‌లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. అప్సర రాణి మంచి నటి, డ్యాన్సర్‌ అని ఈ సందర్భంగా వివరించారు. వర్మ ఇప్పటికే ఏటీటీ వేదిక ద్వారా పలు సినిమాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.