ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్న రియా చక్రవర్తి!

బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో అతని ప్రేయసి రియా చక్రవర్తినే కారణమంటూ సుశాంత్‌ తండ్రి కృష్ణ కుమార్ పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టారు. అయితే ఈ నేపథ్యంలో నటి రియా చక్రవర్తి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. న్యాయవాది సతీష్ మాన్‌షిండే రియా తరపున బెయిల్‌కు దరఖాస్తు చేయనున్నట్లు సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. మందస్తు బెయిల్ కోసం ఆమె లాయర్లు డ్రాఫ్ట్ తయారు చేశారని చెప్పుకుంటున్నారు. రియా కూడా వాటిపై నిన్నటి రాత్రే సంతకం చేసినట్లు అర్థమవుతోంది. ఇవాళ సెషన్స్ కోర్టులో రియా ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. సతీష్‌ మాన్‌షిండే ప్రముఖ క్రిమినల్‌ లాయర్‌ అన్న సంగతి తెలిసిందే. ఆయన ఇటీవలే పాల్గర్ ఊచకోత కేసులో సతీష్‌ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు. సినిమా వాళ్లకి సంబంధించి 1990 ముంబై పేలుళ్ల కేసులో బాలీవుడ్‌ సంజయ్ దత్ తరపున సతీషే వాదించారు. అదే కేసులో సల్మాన్ ఖాన్ తరపున కూడా అతను వాదించారు. సుశాంత్‌ తండ్రి ఎప్పుడైతే పాట్నా పోలీసు స్టేషన్‌లో రియాపై కేసు పెట్టారో అప్పటి నుంచి రియా చక్రవిర్త ఆచూకీ లేనట్లు తెలుస్తోంది. బీహార్ పోలీసులు ఇప్పటికే సుశాంత్ సన్నిహితుల్ని ప్రశ్నించారు. రియా ఇంటికి పోలీసులు వెళ్తే అక్కడ ఆమె లేనట్లు తెలిసింది. ఆమెకు ఫోన్ చేసినా రియా ఎటువంటి స్పందన లభించడం లేదు. మరోవైపు రియాకు బీహార్‌ పోలీసులు నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ముంబైలో బాంద్రాలోని ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న సుశాంత్ కేసును పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో దాదాపు 37 మందిని విచారించారు. రియాపై సుశాంత్‌ తండ్రి వేసిన కేసు ఏమిటంటే.. 'గడిచిన ఏడాది కాలంలో రూ.17కోట్లలో రూ.15 కోట్లు ఓ అజ్ఞాతవ్యక్తికి ట్రాన్స్‌ఫర్ అయ్యాయి. ఇందులో రియా చక్రవర్తి పాత్ర ఏంటి? ఆమె కుటుంబ సభ్యులకు ఎంత నగదు బదిలీ అయ్యిందనే ‍ విషయాన్ని పోలీసులకు దర్యాప్తు చేయాలని పోలీసులను కోరుతున్నారు.

View this post on Instagram

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) onCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.