‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో శ్రియ?

ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం గురించి ఏ విషయం బయటకొచ్చినా ఆసక్తి రేకెత్తిస్తోంది. తాజాగా కథానాయిక శ్రియ నటిస్తుందని వార్తలొస్తున్నాయి టాలీవుడ్‌లో. ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. అజయ్‌కు జోడిగా శ్రియ కనిపించబోతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. వికారాబాద్‌ అడవుల్లో జరుగుతున్న చిత్రీకరణలో అజయ్‌తోపాటు శ్రియ కూడా పాల్గొందని సమాచారం. చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరి ఈ క్రేజీ ప్రాజెక్టులో శ్రియ అవకాశం దక్కించుకుందా, లేదా? అంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. రామ్‌ చరణ్, ఎన్టీఆర్‌లతో ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఛత్రపతి’లో నటించింది శ్రియ.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.