రాజమౌళి ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ టైటిల్‌ వచ్చేసింది!

యావత్‌ సినీ ప్రేక్షకులంతా ఎప్పుడా ఎప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తోన్న రోజు రానే వచ్చింది. ‘బాహుబలి’ దర్శకధీరుడు ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ టైటిల్‌ లోగా వచ్చింది. యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ కలిసి నటిస్తున్న సినిమా ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’కి (రౌద్రం రణం రుధిరం)గా సినిమా పేరును ఖరారు చేశారు. ఈ రోజు అనగా శర్వారినామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకొని చిత్రబృందం తన టైటిల్‌ లోగోని ఆవిష్కరించారు. చిత్రకథలో ఎన్టీఆర్‌ తెలంగాణ పోరాటయోధుడు కొమరం భీంగా, రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మితమయ్యే ఈ చిత్రంలో హాలీవుడ్‌కి చెందిన ఒలీవియా మోరీస్‌ ఎన్టీఆర్‌ సరసన నటిస్తుంది. ఇక బాలీవుడ్‌ నుంచి అలియా భట్‌ రామ్‌చరణ్‌తో కలిసి నటిస్తోంది. అజయ్‌ దేవగణ్, సముద్రఖనిలాంటి నటులు కూడా ఇందులో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.