సినీ నటుడు సచిన్‌ జోషిని అరెస్టు చేసిన పోలీసులు

ప్రముఖ నటుడు, వ్యాపారవేత్త అయిన సచిన్‌ జోషిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన దుబాయి నుంచి ముంబై ఎయిర్‌పోర్టు చేరుకోగానే హైదరాబాద్‌కి చెందిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబై నగరం నుంచి హైదరాబాద్‌కు గుట్కా అక్రమ రవాణాలో సచిన్‌ పాత్ర ఉందనే ఆరోపైణలపై ఆయన్ను అరెస్టు చేశారు. ఈ ఏడాది మార్చి నెల్లో ఆయనపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం కేసులో భాగంగా సచిన్‌ని ప్రశ్నించిండం కోసం ముంబై నుంచి హైదరాబాద్‌కి తరలించారు. అన్నట్లు సచిన్‌ జోషి తెలుగులో ‘మౌనమేలనోయి’ చిత్రంలో నటించి మెప్పించారు. తరువాత ‘నిను చూడగ నేనుండలేను’, ‘ఒరే పాండు’, ‘నీజతగా నేనుండాలి’, తాతినేని సత్య దర్శకత్వంలో ‘వీడెవడు’ చిత్రంలో కబడ్డీ ప్లేయర్‌గా నటించారు. సందీప్‌ కిషన్‌ - తమన్నా కలిసి నటించిన ‘నెస్ట్ ఎంటి’ చిత్రాన్ని నిర్మించారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.