సాయి పల్లవికి పెళ్లి చేసుకొనే ఆలోచన లేదట!

సాయి పల్లవి చూస్తుంటే మన పక్కింటి అమ్మాయిలా కనిపిస్తోంది. ఆమె నటనలోనూ అంత ఈజీ కనిపిస్తోంది. దక్షిణాదిలో తెలుగు, తమిళం, మాలయాళంలోనూ సినిమా చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. తాజాగా ఈ అమ్మడు విదేశి వైద్య విద్యకు సంబంధించి గ్రాడ్యుయేట్‌ ప్రవేశ పరీక్షకు హాజరైంది. తాజాగా పెళ్లి విషయంపై తొలిసారిగా సాయి పల్లవి నోరు విప్పిందట. ఆడపిల్లలు పెళ్లి చేసుకొంటే కన్నతల్లితండ్రులను విడిచిపెట్టి మెట్టినింట అడుగు పెట్టాల్సి వస్తుంది. అందుకే పెళ్లి చేసుకోకుండా అమ్మానాన్నలను బాగా చూసుకుంటే సరిపోతుంది కదా’ అని చెప్పిందట. మొత్తం మీద సాయిపల్లవి కన్నవారిపై ప్రేమను ఇలా తెలియజేసిందని కొంతమంది అనుకోగా, మరికొంత మంది మాత్రం జీవితం అన్నాక అన్నీ ప్రేమలను రుచి చూడాల్సిందే అంటున్నారట. ప్రస్తుతం సాయి పల్లవి తెలుగులో రానా దగ్గుబాటితో కలిసి విరాటపర్వంలో నటిస్తోంది. ఇక శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ ప్రేమకథ లవ్‌స్టోరీలో కథానాయికగా నటిస్తోంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.