పెళ్లి తరువాత ట్రోల్‌ చేశారు!

పెళ్లయ్యాక చాలా మంది భామల సినీ కెరీర్‌ మసకబారిపోతుంది. సమంత మాత్రం హిట్ల మీద హిట్లు కొడుతూ టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలుగుతోంది. ఇటీవల ‘హైదరాబాద్‌ టైమ్స్‌’ నిర్వహించిన సర్వేలో ఈ అమ్మడు ‘మోస్ట్‌ డిజైరేబుల్‌ లేడీ ఆఫ్‌ ది ఇయర్‌-2019’ గా ఎంపికైంది. ఈ సందర్భంగా ఆమె కొన్ని విషయాలు అభిమానులతో పంచుకుంది. పెళ్లి తరువాత సమంతను చాలా మంది ట్రోల్‌ చేశారంట. అవన్నీ ఆసక్తికరంగా చెప్పుకొచ్చింది. ‘నేను పెళ్లి తరువాత మొదటిసారిగా రివీలింగ్‌ అవుట్‌ఫిట్‌ ధరించినప్పుడు చాలా మంది ట్రోల్‌ చేశారు. మళ్లీ రెండోసారి అటువంటి దుస్తులే ధరించి ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పుడు ట్రోలింగ్‌ చాలా వరకు తగ్గింది. అప్పుడే నాకొకకటి అర్థం అయ్యింది. మనం ఎప్పుడైనా మొదటి అడుగు వేసేటప్పుడు చాలా ధైర్యంగా ఉండాలి. అప్పుడే ముందుకు వెళ్లగలుగుతాం. నేను పెళ్లి చేసుకున్నప్పుడు అందరిలాగే నా కెరీర్‌ కూడా ముగిసిపోతుందనుకున్నా. కానీ వివాహమనేది నా కెరీర్‌పై ఎటువంటి ప్రభావం చూపించలేదు’ అంటూ వివరించిందీ అక్కినేని కోడలు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.