‘మహాసముద్రం’లోకి అతిథి.. సామ్‌ వద్దనడానికి కారణమదేనా?

‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేం అజయ్‌ భూపతి ‘మహాసముద్రం’ అనే ప్రాజెక్టు చేస్తున్న సంగతి తెలిసిందే. పలు కథానాయకుల చేతుల్లోకి వెళ్లొచ్చిన ఈ కథ చివరకు శర్వానంద్‌కు దక్కిందని సమాచారం. ఈ చిత్రంలో శర్వా సరసన నటించేందుకు ముందుగా సమంతను ఎంపిక చేసింది చిత్రబృందం. ‘జాను’ చిత్రంలో నటించి మెప్పించిన శర్వా, సామ్‌ జంట మరోసారి కనువిందు చేస్తుందనుకున్నారంతా. కానీ, సమంత ఈ చిత్రం నుంచి తప్పుకుందని, ఆమె స్థానంలో అతిథి రావు హైదరిని తీసుకునే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తోంది. సామ్‌ వద్దనడానికి ప్రధాన కారణం ఇదే అని టాలీవుడ్‌లో ప్రచారం సాగుతుంది. అదేంటంటే.. కెరీర్‌ ప్రారంభంలో ఎలా ఉందో, పలు చిత్రాలతో పెళ్లి తర్వాత కూడా సామ్‌ అంతే బిజీగా ఉంది. ఆమె దగ్గరకు మంచి పాత్రలు రావడం వల్లే వాటిని కాదనలేకపోయింది. ఇప్పుడు విరామం తీసుకోవాలనుకుంటుందట. కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉండి వైవాహిక జీవితాన్ని సరదాగా గడపాలనుకుంటుందని సమాచారం. సినిమాలకు కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అదన్న మాట సంగతి.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.