చై, సమంతల సినిమా ‘మహాసముద్రం’

‘మజిలీ’ ఓ ప్రేమికుడి విషాద గాధ. అందులో కాస్త క్లాస్‌ టచ్‌ ఉన్న పాత్రని పోషించాడు నాగచైతన్య. ఈసారి మాత్రం పక్కా మాస్‌ పాత్రలో కనిపించనున్నాడు. ‘ఆర్‌.ఎక్స్‌ 100’తో ఆకట్టుకున్న అజయ్‌ భూపతి దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ‘మహా సముద్రం’ అనే పేరు పరిశీలిస్తున్నారు. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో జరిగే కథ ఇది. మాఫియా నేపథ్యంలో సాగబోతోంది. ఓ మాఫియా ముఠాకీ, కథానాయకుడికీ మధ్య జరిగే పోరే... ‘మహా సముద్రం’.  ఇందులో చైతు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. కథానాయికగా సమంత పేరు పరిశీలిస్తున్నారు. ‘మజిలీ’లోనూ నాగచైతన్య - సమంత జోడీ కట్టిన సంగతి తెలిసిందే. అజయ్‌ భూపతి చెప్పిన కథ చై, సమంతలిద్దరికీ నచ్చిందని, సమంత తన నిర్ణయాన్ని త్వరలో ప్రకటించనున్నదని సమాచారం.

సంబంధిత వ్యాసాలు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.