ఎన్టీఆర్‌ చిత్రంలో సమంత?

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ‘ఆర్‌.ఆర్‌.ఆర్’‌ చిత్రం తరువాత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేయనున్నారు. ఇప్పటికే సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలు నటించనున్నారని చెప్పుకుంటున్నారు. అయితే ఇందులో సమంతను ఓ కథానాయికగా తీసుకోనున్నారని వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారని వార్తలొస్తున్నాయి. ఈ చిత్రంలో పూజాహెగ్డే, జాన్వీ కపూర్‌లాంటి నాయికల పేర్లు సైతం వినిపించాయి. మొత్తం మీద ఎవరు ఎన్టీఆర్‌ సరసన చిందేస్తారో తెలియాలంటే మరికొన్నాళ్ల పాటు వేచి చూడాల్సిందే. ఈ సినిమాని హారిక అండ్ హాసిని ఎంటర్టైన్మెంట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పై రాధాకృష్ణ - కళ్యాణ్ రామ్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందించనున్నాడు. ఇప్పటికే సమంత ఎన్టీఆర్‌తో కలిసి నాలుగు చిత్రాల్లో నటించింది. విశేషం ఏమిటంటే ఇప్పటి వరకు ఎన్టీఆర్‌ - సమంత కలిసి నటించిన ఈ చిత్రాలన్నింటిలోనూ ఇద్దరేసి కథనాయికలు ఉన్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.