మరో తమిళ చిత్రంలో సమంత?

ప్రస్తుతం ‘కాత్తు వక్కుల రెందు కాదల్‌’ అనే తమిళ చిత్రం ఓకే చేసింది సమంత. విజయ్‌ సేతుపతి కథానాయకుడుగా విఘ్నేష్‌ శివన్‌ తెరకెక్కిస్తున్నాడు. ముక్కోణపు ప్రేమ కథగా రూపొందుతున్న ఈ చిత్రంలో నయనతార మరో నాయిక. తొలిసారి నయన్‌తో కలిసి నటిస్తుండటంతో తెలుగు ప్రేక్షకుల్లోనూ ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. ఇదిలా ఉండగా మరో తమిళ సినిమాలో నటించేందుకు సిద్ధవమైందని టాక్‌. ‘గేమ్‌ ఓవర్‌’ ఫేం అశ్విన్‌ శరవణన్‌ ఓ థ్రిల్లర్‌ తెరకెక్కిస్తున్నాడట. కథానాయకుడుగా ప్రసన్నను ఎంపిక చేయగా, నాయికగా సమంతను తీసుకోనున్నారని తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. కథానాయిక స్నేహ భర్తే ప్రసన్న. ఇటీవలే తమిళ రీమేక్‌ ‘జాను’ చిత్రంతో అలరించిన సామ్‌ మరో రెండు తమిళ చిత్రాలు పట్టాలెక్కిస్తుండటం విశేషం.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.