అలాంటి బలం అందరికీ అవసరమే

సమంత జీవితంలో చాలా దశలు ఉన్నాయి. ఆటు పోట్లతో కూడిన ఆ దశలన్నీ తనకి కఠినపాఠాల్నే నేర్పాయని చెబుతోందామె. ఇప్పుడు వరుస విజయాలతో దూసుకెళుతోంది. నటిగా తనదైన ప్రభావం చూపిస్తోంది. ఇది అత్యుత్తమదశ అనుకోవచ్చా? అని అడిగితే... ‘‘నటిగా నేను అందుకుంటున్న అవకాశాలు, చేస్తున్న పాత్రలు నిజంగా నేనెంత అదృష్టవంతురాల్నో చెబుతున్నాయి. ఒకొక్క సినిమాతో ఒక్కో అడుగు ముందుకేసే అవకాశం దొరకడం గొప్ప పరిణామమే. ఇలాంటి దశని ఆస్వాదించాల్సిందే. కాకపోతే ఇదే మన జీవితం, ఎప్పుడూ ఇలాంటి దశలోనే ఉంటామని మాత్రం అనుకోకూడదు. ప్రయాణం ఎప్పుడూ ఒకలాగే ముందుకు సాగదు. మధ్యలో మళ్లీ ఒడుదొడుకులు ఎదురవుతాయి. వాటిని అధిగమించే బలాల్ని కూడా ఈ దశలోనే సంపాదించాలి. అలాంటి బలం అందరికీ అవసరమే. రేపు బాగుంటుందని నమ్ముతూనే మనం కొత్త పాఠాల్ని నేర్చుకుంటూ సాగాలి’’ అని చెప్పింది సమంత. త్వరలోనే ఆమె శర్వానంద్‌తో ‘జాను’ చిత్రంలో సందడి చేయబోతోంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.