తెలుగు సినీనిర్మాత నాగ అశోక్‌ కుమార్‌కు మాతృవియోగం

తెలుగు చిత్రసీమలో ఎన్నోవిజయవంతమైన చిత్రాలు రూపొందించిన నిర్మాత శానం నాగ అశోక్‌ కుమార్‌కి మాతృవియోగం కలిగింది. శానం నాగ అశోక్‌ కుమార్‌ తల్లి అయిన చంద్రావతి తుదిశ్వాసను విడిచారు. ఆమె వయసు తొంభై సంవత్సరాలు. పశ్చిమ గోదావరి జిల్లాలోని తన స్వగ్రామం కైకవరంలో ఆమె బుధవారం గుండుపోటుకు గురైంది. చంద్రావతికి మొత్తం నలుగురు సంతానం. అందులో శానం నాగ అశోక్‌ కుమార్‌ రెండోవాడు. ఆయన తల్లి మరణం పట్ల చిత్రసీమకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. అశోక్ కుమార్‌ శ్రీ సాయి దేవ ప్రొడక్షన్స్ పతాకంపై ‘వసంతం’, ‘శుభాకాంక్షలు’, ‘దొంగదొంగది’, ‘ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే’, ‘నిన్నుచూశాక’, ‘మౌనరాగం’ వంటి విజయవంతమైన చిత్రాలకు నిర్మాతగా వ్యవవహరించారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.