సీసీబీ కార్యాలయంలో సంజన గల్రానీ!

ప్రస్తుతం కర్నాటకలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో భాగంగా బెంగళూరు సీటీ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు ఈ తెల్లవారుజామున నటి సంజన ఇంటిని సోదా చేశారు. ఇప్పటికే కన్నడ నటి డ్రగ్స్ మాఫియా కేసులో నటి రాగిణి ద్వివేదిని అరెస్టు చేశారు. ప్రస్తుతం సంజన గల్రానీ ఇంటిని సోదాచేసి సీసీబీ కార్యాలయానికి తరలించారు. కేవలం డ్రగ్స్‌ కేసులో విచారణలో భాగంగానే సంజనను సీసీబీ అధికారులు కార్యాలయానికి తరలించారు. సంజనతో పాటు ఆమె తల్లితండ్రులు కూడా సీసీబీ ఆఫీసుకి వెళ్లారు. కానీ విచారణ చేసింది సంజనాను మాత్రమేనట. డ్రగ్స్‌ మాఫియా కేసులో ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న సంగతి తెలిసిందే. కేసు దర్యాప్తులో భాగంగా సంజన ల్యాప్‌టాప్, మొబైల్, పెన్‌డ్రైవ్‌లను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్‌ అక్రమరవాణ కేసులో కన్నడ చిత్రసీమకు చెందిన చాలామంది ఉన్నారు. సీసీబీ ఇప్పటికే నలుగురి అరెస్టు చేసింది. వారిలో కన్నడ నటి రాగిణి ద్వివేదిని మరో ఐదురోజుల పాటు కస్టడీలోకి తీసుకుంది. సినీ నటులకు డ్రగ్స్  సరాఫరా చేస్తున్న కేసులో, ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళకు చెందిన డ్రగ పెడ్లర్‌ నియాజ్‌ని సోమవారం సీసీబీ అరెస్టు చేసింది. సంజన గల్రానీ తెలుగులో పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘బుజ్జిగాడు’ చిత్రంలో త్రిష చెల్లెలిగా నటించింది. Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.