‘సర్కారు వారి పాట’.. విడుదలపై మహేష్‌ క్లారిటీ

‘‘సర్కారు వారి పాట’ చిత్ర రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చారు కథానాయకుడు మహేష్‌బాబు. ఇది ఆయన కథానాయకుడిగా నటించనున్న కొత్త చిత్రం. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. మైత్రీ మూవీస్‌, 14రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నేడు తన తండ్రి సూపర్‌స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా ఈ చిత్ర టైటిల్‌ పోస్టర్‌ను కానుకగా అందించారు మహేష్‌. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతోనూ ముచ్చటించారు. ఈ సందర్భంగా వారు అడిగిన అనేక ప్రశ్నలకు చక్కగా బదులిచ్చారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్‌ పూరితో సినిమా ఎప్పుడు? అని ప్రశ్నించగా.. నేను దాని కోసమే ఎదురు చూస్తున్నా అన్నారు. ‘‘నేనెంతో ఇష్టపడే దర్శకుల్లో పూరి ఒకరు. ఆయన ఎప్పుడెప్పుడు వచ్చి కథ చెప్తారా? అని నేను ఆసక్తిగా ఎదరు చూస్తున్నా’’ అన్నారు. ఇక తన కొత్త చిత్ర కథా నేపథ్యం గురించి ప్రశ్నించగా.. ఇది చక్కటి వినోదంతో పాటు బలమైన సందేశమున్న చిత్రమని చెప్పారు. ప్రస్తుత పరిస్థితులు కుదుటపడి.. సినిమా సెట్స్‌పైకి వెళ్లాకే విడుదల తేదీపై ఓ స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు క్లారిటీ ఇచ్చారు.

ఇవీ చదవండి..

బుర్రిపాలెం బుల్లోడు.. అద్భుతాల అసాధ్యుడు

రానా పెళ్లి ముహూర్తం అప్పుడే..

మే 31.. (సినీ చరిత్రలో ఈరోజు)


సంబంధిత వ్యాసాలు


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.