దుబాయ్‌కి వెళ్లనున్న ‘సర్కారు వారి పాట’ చిత్రబృందం

మిల్కీస్టార్‌ మహేష్‌బాబు నటిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో కథానాయికగా కీర్తి సురేష్‌ నటిస్తోంది. తాజాగా సినిమా షూటింగ్‌ ఈనెల 25 నుంచి దుబాయ్‌లో ప్రారంభం కానుందని సమాచారం. బ్యాంక్‌ కుంభకోణాల నేపథ్యంలో వస్తోన్న చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్,జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్ల్స్ ఫ్లస్‌ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కరోనా మహమ్మారి లేకుంటే ఈ పాటికే సినిమా చిత్రీకరణ చాలా భాగం పూర్తయ్యేది. తొలుత చిత్రాన్ని అమెరికాలోనూ చిత్రీకరించాలని నిర్ణయించుకున్నారు. అయితే మళ్లీ కరోనా వైరస్‌ విజృంభించడంతో ప్రస్తుతానికి ఆ ఆలోచనలు విరమించుకున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. సినిమాలో వెన్నెల కిషోర్, సుబ్బరాజుతో పాటు భారీ తారాగణం నటించనుంది. ఫైట్ మాస్టర్: రామ్ - లక్ష్మణ్. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.