సర్కారు వారి పాటలో విద్యాబాలన్‌?

మిల్కిస్టార్‌ మహేష్‌బాబు నటిస్తున్న నటిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియా చిత్రంగా నిర్మించేందుకు చిత్రబృందం యోచిస్తుందట. చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ నటింపజేసేందుకు చిత్రబృందం ప్రయత్నాలు చేస్తుందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అంతేకాదు పాత్ర పోషించడానికి నటి విద్యాబాలన్‌ కూడా అనుకూలంగా స్పందించినట్లు వార్తలొస్తున్నాయి. విద్యాబాలన్‌ ఇప్పటికే తెలుగులో ‘ఎన్టీఆర్:‌ కథానాయకుడు’ చిత్రంలో బసవతారకం పాత్రలో నటించి మెప్పించింది. అన్నట్లు చిత్రంలోని ప్రతినాయకుడి పాత్రలో హిందీ నటుడు అనిల్‌ కపూర్‌ పేరు కూడా బాగా వినిపిస్తోంది. సినిమా చిత్రీకరణ కోసం యుఎస్‌ఏలోని డెట్రాయిట్‌ సిటీలో జరిపేందుకు నిర్మాణ సంస్థ నిర్ణయించకున్నారట. అంతేకాదు అతి త్వరలోనే డెట్రాయిట్‌ సిటీలోని లోకేషన్ల ఎంపిక కోసం దర్శకుడితో పాటు సినిమాటోగ్రాఫర్‌ కూడా అక్కడి వెళ్లనున్నారట. సుమారు నలభైఅయిదు రోజుల పాటు షూటింగ్‌ని అక్కడే చేసేందుకు ప్రణాళికలు రచించుకున్నారట. ఈ ఏడాది నవంబర్‌,డిసెంబర్‌ మాసాల్లో అక్కడే ఉండనున్నారట. జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రంలో కీర్తి సురేష్‌ కథానాయికగా నటిస్తోంది. తమన్‌ సంగీత స్వరాలు అందిస్తున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.