బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్‌ఖాన్ కన్నుమూత

బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్‌ఖాన్ గుండెపోటుతో ఈ రోజు అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. 71 యేళ్ల సరోజ్‌ఖాన్ శ్వాస కోస వ్యాధితో ఈ గతనెల 20వ తేదీన బాంద్రాలోని గురునానక్ అనే ప్రవేట్‌ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. సరోజ్ ఖాన్ శ్వాసకోస సంబంధ సమస్యలతో బాధపడుతుండటంతో వైద్యులు ఆమెకు కరోనా పరీక్షలు చేయగా నెగిటివ్ అని రిపోర్టు వచ్చింది. అయినా ఇలా జరగగడం బాధాకరం అని పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు అంటున్నారు. సరోజ్ ఖాన్ నాలుగు దశాబ్దాలుగా దాదాపు రెండు వేల పాటలకు కొరియోగ్రఫీ అందించారు. ఆమె కొరియాగ్రఫీ చేసిన చిత్రాలు చాలానే ఉన్నాయి. 1975లో ‘మౌసమ్’ చిత్రంతో బాలీవుడ్‌లో కొరియోగ్రాఫర్ పరిచయం అయ్యారు. ఆమెకు ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా 3 జాతీయ అవార్డులు అందుకుంది. ‘దేవదాస్’‌ చిత్రంలోని ‘‘డోలా రె డోలా’’, ‘జబ్‌ వి మెట్’‌ చిత్రంలో ‘‘ఏ ఇష్క్ హాయే’’, ‘తను వెడ్స్ మను రిటర్న్స్’, ‘మణికర్ణిక’,లాంటి చిత్రాలు ఆమెకు ఎంతో గుర్తింపు తీసుకొచ్చాయి. సరోజ్ ఖాన్ చివరిసారిగా 2019లో కరణ్ జోహర్ నిర్మించిన ‘కళంక్’ చిత్రంలో బాలీవుడ్‌ నటి మాధురీ దీక్షిత్‌ నర్తించిన ‘‘తబా హోగయీ..’’ అనే పాటకి కొరియోగ్రఫి చేసింది. ఆమెలో మరోకోణం కూడా ఉంది. సినిమా రచయితగా ‘వీర్‌ దాదా’, ‘ఖిలాడి’, ‘ఛోటే సర్కార్’‌, ‘భాయి భాయి’, ‘దిల్‌ తేరా దివానా’ లాంటి చిత్రాలకు కథను కూడా అందించింది. సరోజ్‌ ఖాన్‌ అసలు పేరు నిర్మలా నాగ్‌పాల్‌. ఈ తల్లితండ్రులు కిషన్‌చంద్ సింగ్‌, నోని సింగ్‌లు. ఉమ్మడి భారతదేశంలోని పాకిస్తాన్‌లో పుట్టిన ఈమె కుటంబీకులు రెండుదేశాలు విడిపోయిన తరువాత భారత్‌కి వలస వచ్చారు. సరోజ్‌ మూడేళ్ల వయసులోనే బాలనటిగా తన జీవితాన్ని ప్రారంభించింది. అప్పటి ఫిల్మ్ కొరియాగ్రాఫర్‌ బి.సోహన్‌లాల్‌ దగ్గర నృత్యం నేర్చుకుంది. సరోజ్‌ తన 13 యేటనే పెళ్లిచేసుకుంది. సరోజ్‌ఖాన్‌ మరణం పట్ల చిత్రసీమతో పాటు పలురంగాలకు చెందిన ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా సానుభూతిని తెలియజేశారు.

 


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.