ఆంధ్ర అమ్మాయిగా సీరత్‌ కపూర్‌!

‘రన్‌ రాజా రన్‌’ చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి ప్రవేశించిన ఉంగరాల జుట్టు అమ్మాయి సీరత్‌ కపూర్‌. త్వరలో ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీల’ నటుడు సిద్దు జొన్నలగడ్డతో కలిసి ‘మా వింత గాధ వినుమ’ చిత్రంలో నటించనుంది. ‘‘ఈ కొత్త సినిమాలో నా పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఓ సగటు తెలుగు అమ్మాయిగా అటు కెరీర్‌ని ఇటు తల్లితండ్రులను అర్థం చేసుకొని క్రమశిక్షణతో మెలిగే సాధారణ అమ్మాయిగా కనిపించనున్నా’’నని చెప్పింది. ఆదిత్య మందల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం కరోనా వైరస్‌ వల్ల షూటింగ్‌ ప్రారంభం కాలేదు. సీరత్‌ ‘రన్‌ రాజా రన్‌’లో శర్వానంద్‌తో ఆడిపాడిన తరువాత తెలుగులో ‘టైగర్‌’, ‘రాజు గారి గది2’, ‘ఒక్కక్షణం’ రవితేజతో కలిసి ‘టచ్‌ చేసి చూడు’లో నటించింది.




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.