శేఖర్‌ కమ్ముల తండ్రి కన్నుమూత

ప్రముఖ తెలుగు దర్శకుడు శేఖర్‌ కమ్ముల తండ్రి అయిన కమ్ముల శేషయ్య కన్నుమూశారు. వయసు పైబడటంతో గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన ఈ రోజు హైదరాబాద్‌లోని ప్రవేట్‌ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 89 సంవత్సరాలు. శేఖర్‌ కమ్ముల తండ్రి అంత్యక్రియలు ఈరోజు సికింద్రాబాద్‌లోని బన్సీలాల్‌ పేట శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరగనున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. శేషయ్య మృతి పట్ల చిత్రసీమకు చెందిన పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. కొంత సామాజిక మాధ్యమాల ద్వారా, మరికొంత మంది సన్నిహితులు ఫోన్‌ ద్వారా శేఖర్‌ని పరామర్శిస్తున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.