రాజు సుందరం దర్శకత్వంలో శర్వా?

చాలా కాలం తర్వాత ప్రముఖ కొరియోగ్రాఫర్‌ రాజు సుందరం మెగాఫోన్‌ పట్టబోతున్నాడని కోలీవుడ్‌ టాక్‌. శర్వానంద్‌ హీరోగా తమిళంలో ఓ చిత్రం తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. గతంలో శర్వా తమిళ భాషలో ఒక చిత్రం చేశాడు. తెలుగులో ‘రాజాధిరాజా’గా విడుదలైంది. ఇప్పుడు రాజు సుందరం సైతం తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేసే ప్రయత్నంలో ఉన్నాడని తెలుస్తోంది. 2008లో ‘ఏగన్‌’ అనే తమిళ చిత్రానికి దర్శకత్వం వహించాడు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత శర్వాను డైరెక్ట్‌ చేస్తుండటంతో అందరిలో ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ‘శ్రీకారం’ చిత్రంలో నటిస్తున్నాడు శర్వా. ఆ తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో మరో చిత్రంలో నటించే అవకాశాలున్నాయి. వీటి తర్వాత రాజు సుందరంతో కలిసి పనిచేస్తాడేమో చూడాలి.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.