స్టార్‌ హీరోతో కొత్త చిత్రం..

ఒకటి తర్వాత మరొకటి అన్నట్లుగా సినిమాల విషయంలో చాలా నిదానంగా ప్రయాణం సాగిస్తుంటారు దర్శకుడు శేఖర్‌ కమ్ముల. కానీ, ఇప్పుడు ఓ చిత్రం సెట్స్‌పై ముస్తాబవుతుండగానే ఆయన నుంచి మరో కొత్త కబురు అందింది. అది కూడా ప్రస్తుతం తాను తెరకెక్కిస్తున్న నిర్మాణ సంస్థ ఎల్‌.ఎల్‌.పి బ్యానర్‌లోనే ఈ కొత్త చిత్రమూ ముస్తాబవనుంది. తాజాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది నిర్మాణ సంస్థ. ఇప్పుడీ సంస్థలోనే నాగచైతన్య - సాయిపల్లవి జంటగా ‘లవ్‌స్టోరీ’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు శేఖర్‌ కమ్ముల. ఇంకా మరో 15రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడిది పూర్తయిన వెంటనే ఇదే బ్యానర్‌లో తన తర్వాతి చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు. ఇందులో ఓ అగ్ర కథానాయకుడు నటించనున్నారని చిత్ర నిర్మాణ సంస్థ తన ప్రకటనలో పేర్కొంది. త్వరలోనే దీనిపై మరిన్ని వివరాలు తెలియజేయనున్నట్లు చెప్పారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.