కట్టప్ప కొడుకు చిత్రం ‘రేంజర్’‌

తమిళనటుడు సత్యరాజ్ తనయుడు శిబి సత్యరాజ్‌‌ చేస్తున్న కొత్త చిత్రం ‘రేంజర్’‌. ధరణిధరన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుంది. చిత్రం డబ్బింగ్‌ పనులను ఈరోజు ప్రారంభించింది. సినిమాని వచ్చే ఏడాది పొంగల్‌ నాటికి విడుదల చేయాలన్ని నిర్మాణ సంస్థ సన్నాహాలు చేస్తుంది. రన్‌వీర్‌కుమార్‌ సమర్పణలో న్యూఏజ్‌ సినిమా, అవురా సినిమా సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మహేష్‌ గోవిందరాజ్‌, అర్చన చంద, హతేష్‌ థక్కర్‌ నిర్మాతలు. ఇందులో రమ్య నంబీషన్‌, మధుశాలినిలు కథానాయికలుగా నటిస్తున్నారు. మొత్తం మీద కట్టప్ప తనయుడు శిబిరాజ్ వచ్చే సంక్రాంతి పండక్కి తెరపై సందడి చేయనున్నాడు. ఈ ఏడాది మార్చిలో లాక్‌డౌన్‌ ముందు ఆయన నటించిన ‘వాల్టర్’‌ చిత్రం థియేటర్లో విడుదలై అలరించింది. 



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.