శివ, జువాల్కర్‌ ఆ‘గమనం’

శ్రియ శరన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గమనం’. సుజనా రావు దర్శకుడు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రూపొందుతుంది. నిత్య మీనన్‌, ప్రియాంక జువాల్కర్‌, శివ కందుకూరి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన శ్రియ, నిత్య ఫస్ట్‌లుక్‌ పోస్టర్లలకు మంచి స్పందన లభించింది. తాజాగా జువాల్కర్‌, శివ లుక్స్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. అలీ పాత్రలో శివ, జారా పాత్రలో జువాల్కర్‌ నటిస్తున్నారు. సంప్రదాయ వస్త్రధారణలో ముస్లిం యువతిగా ప్రియాంక దర్శనమివ్వగా.. జెర్సీ ధరించి, టోపీ పెట్టుకుని క్రీడాకారుడిగా కనిపిస్తున్నాడు శివ. పరీక్షించి చూస్తే ఈ నటీనటుల వెనక భాగంలో బుద్ధుని విగ్రహం కనిపిస్తుంది. మరి ఇద్దరి సంబంధం ఏంటి? వీళ్ల గమనం ఎక్కడికి? అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. రమేష్‌ కరుటూరి, వెంకీ పుషదాపు, జ్ఞాన శేఖర్‌ వీఎస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. మాటలు: సాయి మాధవ్‌ బుర్రా, కూర్పు: రామకృష్ణ అర్రం.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.