ప్రేమకథా నేపథ్యంలో శివానీ రాజశేఖర్‌ కొత్త చిత్రం!

టాలీవుడ్‌ యాంగ్రీహీరో రాజశేఖర్‌ జీవిత దంపతుల ముద్దుల కుమార్తె శివానీ రాజశేఖర్‌. 2019లో అడవి శేష్‌తో కలిసి ‘2 స్టేట్స్’ అనే చిత్రంలో నటించేందుకు సిద్ధమైంది. కానీ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. అయితే తాజాగా శివానీ ఓ కొత్త ప్రేమకథా నేపథ్యంలో ఉన్న సినిమాలో నటించనుంది. మల్లిక్‌ రామ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో తేజ సజ్జా హీరోగా నటించనున్నాడు. చిత్రంలో శివానీ కాలేజీ అమ్మాయిగా నటిస్తోంది. ఇందులో కొన్ని కీలకమైన వైవిధ్యమైన అంశాలు ఉండునున్నాయట. శివానీ గత ఐదు సంవత్సరాలుగా వెండితెర అరంగేట్రం చేయాలని చూస్తుంది. అ మధ్య ఓ మీడియాతో మాట్లాడుతూ..‘‘ సినిమా పరిశ్రమకు చెందిన నేను కూడా నటించాలంటే చాలా అడ్డంకులు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ఆడిషన్లకు సైతం హాజరయ్యాను. కానీ నేను ఎత్తుగా ఉండటం చేత  కొన్నిసార్లు తిరస్కరణకు గురయ్యానని..’’ చెప్పింది. ఇప్పటికే సోదరి శివాత్మిక నటుడు విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌తో కలిసి ‘దొరసాని’ చిత్రంలో సందడి చేసింది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.