శ్రద్ధా ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో సెట్‌ అవుతుందా!

రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న భారీ చిత్రం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’. ఈ చిత్రంలో కథానాయికలుగా రామ్‌చరణ్‌ సరసన బాలీవుడ్‌ నటి అలియాభట్, ఎన్టీఆర్‌ సరసన హాలీవుడ్‌ భామ డైసీ ఎడ్గర్‌ నటిస్తున్నారు. అయితే ఇంతలో డైసీ ఎడ్గర్‌ చిత్రం నుంచి కొన్ని అనివార్య కారణాల వల్ల తప్పుకుంది. అప్పటి నుంచి చిత్రబృందం ఎన్టీఆర్‌ సరసన నటించే భామ కోసం వెతకడం మొదలుపెట్టారు. బాలీవుడ్‌ నుంచి శ్రద్ధా కపూర్, పరిణితీ చోప్రాలను పరిశీలిస్తున్నారని వార్తలొచ్చాయి. కానీ పరిణితీ చోప్రా కంటే శ్రద్దాకపూర్‌కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం.అందులోను శ్రద్దా ఇప్పటికే ప్రభాస్‌ సరసన ‘సాహో’లో చేస్తుంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.