నాకెలాంటి వైరస్‌ లేదంటోన్న ‘జెర్సీ’ భామ

ప్రముఖ దక్షిణాది నటి శ్రద్ధా శ్రీనాథ్‌ కరోనా వైరస్‌ కారణంగా ఇంటికే పరిమితమైందని సామాజిక మాధ్యమాల్లో కోకొల్లలుగా వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ సందర్భంగా ‘జెర్సీ’ నటి శ్రద్ధా శ్రీనాథ్‌ తన ట్విట్టర్‌ వేదిక కొన్ని అంశాలను షేర్‌ చేసింది. అందులో ఏం చెప్పిందంటే..‘‘నేను మార్చి 12, 15వ తేదీల మధ్య హైదరాబాద్‌ నుంచి చైన్నైకి ప్రయాణం చేశాను. ఆ విమానంలో కరోనా వైరస్‌ లక్షణాలు గల వ్యక్తి లేరు. కానీ మా ఇంటికి కర్నాటకకు చెందిన వైద్యధికారులు వచ్చి ఇంటికే పరిమితమవ్వమని చెప్పలేదు. అలాంటి వ్యక్తులు ఎవరూ రాలేదు. దీని గురించి నేను ఎక్కడా సామాజిక మాధ్యమాల్లో మాట్లడలేదు. నా సోదరుడికి తెలిసిన డాక్టర్‌ సలహా మేరకు నా ఇంట్లోని 14రోజుల పాటు నేను ఒంటరిగా ఉండటానికి ఎంచుకున్నా. ఎందుకంటే బాధ్యత గల పౌరురాలిగా. అంతేకాదు ప్రస్తుతం 14 రోజుల సమయం కూడా మార్చి 29వ తేదీనే పూర్తి అయ్యింది. ప్రస్తుతం అమ్మకు  వంటగదిలో  సాయం చేస్తున్నా. మీరు కూడా మాస్కులు ధరించి, ఇంటికే పరిమితం అవ్వండి. కరోనా వైరస్‌ (కోవిడ్‌-19), తప్పుడు వార్తలు వ్యాప్తి చేయడం రెండు చాలా ప్రమాదకరమైనవి’’ అంటూ పేర్కొంది. శ్రద్ధా ప్రస్తుతం తెలుగులో ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీలా’ అనే చిత్రంలో నటిస్తుంది. తమిళంలో రెండు చిత్రాల్లోనూ, కన్నడలో మూడు సినిమాల్లోను నటిస్తుంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.