‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో అలా.. ‘అందాధున్‌’ ఖరారు కాలేదు

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో రామ్‌ చరణ్, జూనియర్‌ ఎన్టీఆర్‌తో కలిసి నటించే అవకాశం రాలేదంటున్నారు నటి శ్రియ. ఈ సినిమాలో శ్రియ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని విశేషాలు పంచుకున్నారు. అవేంటో ఆమె మాటల్లోనే.. ‘‘రాజమౌళి పక్కా వ్యూహంతో వెళ్తున్నారు. ‘ఛత్రపతి’ తర్వాత ఆయనతో మరోసారి కలిసి పనిచేయటం సంతోషంగా ఉంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో అతిథి పాత్ర పోషించాను. అజయ్‌ దేవగణ్‌ సరసన కనిపిస్తాను. అలాంటి గొప్ప నటుడితో పనిచేయడం మంచి అనుభవం. కానీ చెర్రీ, తారక్‌తో కలిసి పనిచేసే అవకాశం రాలేదు. ఈ ఇద్దరి నటన అద్భుతంగా ఉండబోతుంది. సినిమా విడుదల రోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’. ‘అందాధున్‌’ రీమేక్‌లో శ్రియ నటిస్తున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. ఇదే విషయాన్ని ప్రస్తావించగా శ్రియ సమాధానం ఇచ్చారు. ‘‘అవును. నన్ను ఆ సినిమా కోసం సంప్రదించారు. చర్చలు కూడా సాగుతున్నాయి. ఇంకా ఖరారు కాలేద’’ని తెలిపారు. బాలీవుడ్‌లో ఆయుష్మాన్‌ ఖురానా హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో టుబు కీలక పాత్ర పోషించారు. టబు పాత్ర కోసమే శ్రియను అనుకుంటున్నారు. తెలుగు రీమేక్‌ని నితిన్‌ హీరోగా మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్నాడు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.