బెట్టు చేస్తున్న శ్రుతిహాసన్‌!

జాతీయ నటుడు కమల్‌హాసన్‌ కూతురు శ్రుతిహాసన్‌ తొలిసారిగా ‘లక్‌’ అనే హిందీ చిత్రంలో పూర్తిస్థాయి కథానాయికగా రంగప్రవేశం చేసింది. తరువాత తమిళం, తెలుగులోనూ మంచి పాత్రలే చేసింది. ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. కథానాయికగా శ్రుతిహాసన్‌ అయితే బాగుంటుందని అనుకున్నారట. కానీ ఈ అమ్మడు పారితోషికం విషయంలో తగ్గే ప్రసక్తి లేదని చెబుతోందట. మొదట్లో తెలుగులో నటించిన రెండు చిత్రాల్లో పెద్దగా పేరు రాలేదు. 2012లో వచ్చిన పవన్‌ కల్యాణ్‌ ‘గబ్బర్‌సింగ్‌’ చిత్రంతో శ్రుతికి డిమాండ్‌ పెరిగింది. తరువాత మహేష్‌ బాబుతో కలిసి ‘శ్రీమంతుడు’లో నటించి ఉత్తమనటిగా పేరు తెచ్చుకుంది. మధ్యమధ్యలో హిందీలోనూ నటిస్తూ సందడి చేస్తుంది. ‘కాటమరాయుడు’ చిత్రం తరువాత మళ్లీ తెలుగులో చేసిన చిత్రాలు లేవు అయినా పారితోషిక విషయంలో మాత్రం కొంచెం బెట్టు చేస్తుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.