మేమిద్దరం విడిపోయాం..

కథానాయిక శ్రుతి హాసన్‌ లండన్‌కు చెందిన థియేటర్‌ ఆర్టిస్ట్‌ మైఖెల్‌ కోర్సేల్‌తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు వారిద్దరి ప్రేమ తెగతెంపులైంది. ఈ విషయాన్ని మైఖెల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పష్టం చేశారు. ‘జీవితం మమ్మల్నిద్దరినీ వ్యతిరేక మార్గాల్లో ఉంచింది. దురదృష్టవశాత్తు మేమిద్దరం ఒంటరి మార్గాల్లో నడవాల్సి వస్తోంది. కానీ ఈ యంగ్‌ లేడీ ఎప్పటికీ నా బెస్ట్‌ ఫ్రెండ్‌గానే మిగిలిపోతుంది. ఆమెకు జీవితాంతం ఓ స్నేహితుడిగా ఉండిపోతున్నందుకు చాలా గొప్పగా ఫీలవుతున్నాను’ అని రాసి శ్రుతితో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేశారు. వీరిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని, పరస్పరం చర్చించుకుని స్నేహపూర్వకంగానే విడిపోయినట్లు సన్నిహితులంటున్నారు. 2016లో శ్రుతి ఓ విభావరి కోసం లండన్‌ వెళ్లినప్పుడు అక్కడ మైఖెల్‌ పరిచయమయ్యారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మొదలైన స్నేహం ప్రేమగా మారింది. శ్రుతి నెలకోసారైనా మైఖెల్‌ కోసం ఇండియా నుంచి లండన్‌ వెళ్లేది. మైఖెల్‌ కూడా అప్పుడప్పుడు ఇండియా వస్తుండేవారు. ఇటీవల కమల్‌ హాసన్‌ నటించిన ‘విశ్వరూపం 2’ చిత్రంలో మైఖెల్‌ రష్యన్‌ సోల్జర్‌ పాత్రలో నటించారు.

View this post on Instagram

This young lady will always be my best mate. So grateful to always have her as a friend. Luv ya gal 🙏🏽💙

A post shared by Michael Corsale (@themichaelcorsale) onCopyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.