అందుకే విడిపోయాం.. మరోసారి ప్రేమలో పడనని చెప్పలేను

‘కొత్తబంగారులోకం’ చిత్రంతో తెలుగ తెరకు పరిచయమై కుర్రకారును మైమరపించింది శ్వేతాబసుప్రసాద్‌. ఇందులో ‘ఎ..క..డ’ అంటూ సరికొత్తగా మాట్లాడి యువత గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. ఆ తర్వాత దక్షిణాది చిత్రాలతో బిజీగా ఉంటూనే బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. 2018లో రోహిత్‌ మిట్టల్‌ అనే చిత్ర పరిశ్రమకు సంబంధించిన వ్యక్తిని పెళ్లాడిన శ్వేత కొన్ని కారణాల వల్ల విడిపోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తెలిపింది. తాజాగా కోర్టు నుంచి విడాకులు తీసుకునేందుకు వీరిద్దరు సిద్ధమయ్యారు. ఇటీవలే ఈ విషయమై ఓ ఆంగ్ల పత్రిక అడగ్గా స్పందించింది శ్వేత. ‘మేమిద్దరం స్నేహితుల్లా ఉండాలని నిర్ణయించుకున్నాం. అందుకే విడిపోయాం. విడాకుల కోసం కోర్టును సంప్రదించాం. పరస్పర అంగీకారంతోనే విడిపోయాం. నా కెరీర్‌ విషయంలో రోహిత్‌ ప్రోత్సాహం అందించాడు.వృత్తిపరంగా ఆయనకు నేను అభిమానిని. ఏదో ఓ రోజు మేమిద్దరం తప్పకుండా కలిసి పనిచేస్తాం. మా ఐదేళ్ల బంధంలో చాలా సంతోషంగా ఉన్నాం. భార్యాభర్తలుగా విడిపోయినా మంచి స్నేహితులం. మళ్లీ ప్రేమలో పడనని చెప్పలేను కానీ ప్రస్తుతానికి మాత్రం ఆ ఆలోచన లేదు. నా దృష్టంతా కెరీర్‌ మీదే’ అని వివరించింది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.