
ప్రముఖ గాయకుడు, బుల్లితెర హోస్ట్ ఆదిత్య నారాయణ్ శ్వేతా అగర్వాల్‌ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 1వ తేదీన కొద్దిమంది సమక్షంలోనే ఆత్మీయ వివాహ వేడుక జరిగింది. ఆ తరువాత వీరి రిసెప్షెన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ ప్రముఖలతో పాటు బుల్లితెర నుంచి కొంతమంది సభ్యులు హాజరయ్యారు. అయితే తాజాగా తన సతీమణితో కలిసి కొత్త ఇంట్లోకి వెళ్లున్నట్లు వెల్లడించారు. ఆదిత్య 5 బెడ్రూమ్స్ గల అపార్ట్ మెంట్ని నాలుగు కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేశాడు. ఈ కొత్త ఇంటి గురించి స్పందిస్తూ..నేను అంధేరిలో 5బెడ్ రూమ్ ప్లాట్స్ ని కొనుగోలు చేశా. నాకు దగ్గరలోనే అమ్మనాన్నలు ఉంటారని చెప్పారు. ఆదిత్యను కొంతమంది సన్నిహితులు ఆటపట్టిస్తూ..మీ ఆవిడ శ్వేతాకి సగం అపార్ట్ మెంట్ ఇచ్చావా అని అడగ్గా? నేను ఆమెకు డెభ్బై శాతం ఇచ్చాను. నాకు పెద్దగా గదులు అవసరం లేదు. నాకు చాలా తక్కువ వైశాల్యమే సరిపోతుందని కొంటెగా జవాబిచ్చారు. ఆదిత్య - శ్వేతాల పరిచయం ఇప్పటిదీ కాదు. పదేండ్ల కిత్రమే విక్రమ్ భట్ దర్శకత్వం వహించిన హరర్ చిత్రం షాపిట్ సెట్లో కలిశారు.