‘సీనయ్య’గా వస్తున్న వినాయక్‌
ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌ కథానాయకుడుగా చేస్తున్న చిత్రం ‘సీనయ్య’. ఎన్‌.నరసింహ దర్శకత్వం వహిస్తున్నారు. వినాయక్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రంలోని ఆయన ఫస్ట్‌లుక్‌ విడుదల చేసింది చిత్ర బృందం. ఈ పోస్టర్‌లో ఆయన రెంచ్‌ పట్టుకుని, ఎర్రటి కండువా వేసుకుని చిరు నవ్వు చిందిస్తూ కనిపించారు. ఈయన వెనుక ఓ పాత కారు దర్శనమిచ్చింది. ఇదంతా చూస్తుంటే ఆయన ఓ గ్యారేజీ నడుపుతున్నట్లు ఉంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కథానాయిక ఎవరో ఇంకా తెలియలేదు.  Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.