రాజ‌కీయాల్లోకి సుమ‌ల‌త‌
'శుభ‌లేఖ' లాంటి చిత్రాల‌తో ఆక‌ట్టుకున్న న‌టి సుమ‌ల‌త‌. సంప్ర‌దాయబ‌ద్ధ‌మైన క‌థానాయిక పాత్ర‌ల‌కు పెట్టింది పేరు. అంబ‌రీష్‌ని వివాహం చేసుకుని జీవితంలో స్థిర‌ప‌డ్డారు. స్టార్ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న అంబ‌రీష్ ఆ త‌ర‌వాత రాజ‌కీయాల్లోనూ రాణించారు. అంబ‌రీష్ మ‌ర‌ణం త‌ర‌వాత‌.. ఆమెను రాజ‌కీయాల్లోకి తీసుకురావాల‌ని కాంగ్రెస్ పార్టీ గ‌ట్టిగా ప్ర‌య‌త్నించింది. ఇప్పుడు ఆ ప్ర‌య‌త్నాలు స‌ఫ‌లం అయ్యాయి. త్వ‌ర‌లోనే సుమ‌ల‌త కాంగ్రెస్ పార్టీలో చేర‌డం ఖాయ‌మైంది. ఈ విష‌యాన్ని సుమ‌ల‌త కూడా నిర్దారించారు. ''ఈ విషాదం నుంచి ఇంకా కోలుకోలేదు. మ‌రో విష‌యం గురించి ఆలోచించే ప‌రిస్థితుల్లో లేను. కానీ... శ్రేయోభిలాషులు, అభిమానులు, ప్ర‌జ‌ల ఒత్తిడి మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకుంటున్నా. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల‌లో లోక్ స‌భ నుంచి పోటీ చేయాల‌ని భావిస్తున్నా. కాంగ్రెస్ మ‌ద్ద‌తు, ప్ర‌జ‌ల ఆశీస్సులు నాకున్నాయ‌ని గ‌ట్టిగా న‌మ్ముతున్నా'' అని సుమ‌ల‌త ప్ర‌క‌టించారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.