వీళ్ల కథేంటి?
సుమంత్‌ అశ్విన్‌, శ్రీకాంత్‌, భూమిక, తాన్యా హోప్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఇదే మా కథ’. ‘రైడర్స్‌ స్టోరి’ అనే ఉప శీర్షికతో రాబోతుంది. గురు పవన్‌ దర్శకుడు. గురువారం ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. ఈ నలుగురు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌పై ప్రయాణిస్తూ కనిపిస్తున్నారు. అజయ్‌గా అశ్విన్‌, మహేంద్రగా శ్రీకాంత్‌, లక్ష్మీగా భూమిక, మేఘన పాత్రలో తాన్యా నటిస్తున్నారు. నలుగురూ నాలుగు ద్విచక్రవాహనాలతో కనువిందు చేస్తున్నారు. మరి ఈ రైడర్స్‌ కథ ఏంటి? తెలియాలంటే కొన్ని రోజులు ఆగాలి. గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్‌ పతాకంపై మహేష్‌ గొల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సునీల్‌ కశ్యప్‌ సంగీతం అందిస్తున్నారు. ఛాయాగ్రహణం: రామ్‌ ప్రసాద్‌, కూర్పు: జునైద్‌.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.